SRD: మెదక్లో జరిగిన సీఐటీయూ మహాసభలలో CITU రాష్ట్ర కార్యవర్గ సభ్యుడుగా కే రాజయ్య ఐదవ సారి ఏకగ్రీవం అయ్యారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. పారిశ్రామిక ప్రాంతాల కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతానని, సీఐటీయూ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటాలు సాగిస్తామని పేర్కొన్నారు.