AP: హార్ట్ సర్జరీతో కొంత కాలంగా విశ్రాంతి తీసుకుంటున్న కొడాలి నాని త్వరలోనే క్రీయాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా YCP చేపట్టిన కోటి సంతకాల ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. ఇప్పుడిప్పుడే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, 6 నెలల తర్వాత ప్రజా ఉద్యమాలు చేపడతానని అన్నారు.