NLR: ఇనుకూరుపేట మండలం, కొత్తూరులో వంట చేస్తుండగా చీరకు నిప్పంటుకొని తీవ్రంగా గాయపడిన యనమల మస్తానమ్మ(70) చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందింది. ఈ నెల 5న జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. కాగా తీవ్ర గాయాలతో రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మరణించింది.