NTR: విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు సేకరించిన సంతకాల సేకరణ పుస్తకాలను ఈరోజు జిల్లా కేంద్ర కార్యాలయానికి పంపించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. నియోజకవర్గం అంతటా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలు ఏకమవుతూ 96,000 మంది తమ సంతకాలు నమోదు చేశారని తెలిపారు.