E.G: ఖరీఫ్ సీజన్లో 50 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తామని, అందుకు 6 కొట్ల 70 లక్షల గోనె సంచులు అందుబాటులో ఉంచుతామని చెప్పి ఆచరణలో ప్రభుత్వం తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు అన్నారు. బుధవారం రాజమండ్రిలో రైతుల సమస్యలపై నిరసన చేపట్టారు. రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలన్నారు.