SRCL: జిల్లాలో మొత్తం 260 పంచాయతీల్లోని 2,268 వార్డులకు గాను 620 వార్డులు ఏకగ్రీవం కాగా, మిగిలిన 1,648 వార్డులలో మూడు విడతలలో నిర్వహించనున్న ఎన్నికలలో 4,300 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. తుది విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం మొత్తం 12 మండలాలలో వార్డు సభ్యులు, సర్పంచ్ అభ్యర్థులు కలిపి 5,160 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో మిగిలినట్లు అధికారులు తెలిపారు.