NGKL: తిమ్మాజీపేట మండలం గుమ్మకొండ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాపిరెడ్డి నిన్న గుండెపోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి బుధవారం మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబాన్ని పార్టీ పరంగా ఆదుకుంటామని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.