NRPT: పంచాయతీ ఎన్నికల సందర్భంగా నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకిటి శ్రీహరి సొంత ఇలాకాలో 10 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మక్తల్, మాగనూరు మండలాల్లో ఇద్దరు, ఉట్కూరు మండలంలో ముగ్గురు, నర్వ మండలంలో ముగ్గురు ఏకగ్రీవ సర్పంచులుగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి వారికి ఫోన్లు చేసి అభినందనలు తెలిపారు.