W.G: పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం డా. నవ్యజీవన్ అధ్యక్షతన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. గర్భిణులకు అన్నిరకాల పరీక్షలు చేసి పలు సూచనలు చేశారు. రోటరీ క్లబ్ అధ్యక్షుడు డా. కోసూరు ఆనందరాజు 35 గర్భిణులకు పోషకాహార కిట్లను అందజేశారు. గర్భంలో బిడ్డ ఎదుగుదలకు అదనపు పోషకాహారం తీసుకోవాలని సూచించారు.