భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందే పండుగల్లో ఒకటైన దీపావళికి అరుదైన గుర్తింపు దక్కింది. యునెస్కో ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో ఈ పండగను చేర్చారు. ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన సమావేశంలో యునెస్కో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, ఇన్‌టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ సమావేశం భారత్‌లో జరగడం ఇదే తొలిసారి.