AKP: రాంబిల్లి మండలం హరిపురం బీసీటీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి మంగళవారం మధ్యాహ్నం అదృశ్యం అయిన ఆరుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం అయింది. జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా ఆదేశాల మేరకు నాలుగు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో ఆరుగురు విద్యార్థులు దొరికారు. వీరిని అక్కడ నుంచి రాంబిల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువస్తున్నారు.