ప్రకాశం: కనిగిరి కొండపై కలసి ఉన్న మార్తేండేశ్వర స్వామి వారి దేవస్థానంకు సంబంధించిన సర్వీస్ ఇనాం భూమి, సర్వే నెంబర్ 298/2 ల్యాండ్‌లో ఉన్న భూమిని బుధవారం కనిగిరి తహసీల్దార్ విజయలక్ష్మి పరిశీలించారు. ఆలయ ఈవో గిరిరాజు నరసింహబాబు ఆనానికి సంబంధించిన భూములను హద్దులు ఏర్పాటు చేయాలని తహసీల్దార్‌ని కోరారు.