MDK: నిజాంపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రచారంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే పల్లెలు బాగుపడ్డాయన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.