MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం పండగ సాయన్న వర్ధంతి నిర్వహించారు. బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పలువురు ముదిరాజ్ సంఘం నాయకులు హాజరయ్యారు. పండగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పండగ సాయన్న ఆశయ సాధన కోసం కృషి చేస్తామని పిలుపునిచ్చారు.