WGL: కొంతమంది కాంగ్రెస్ పేరు చెప్పుకుని రెబల్ అభ్యర్థులుగా సర్పంచ్ ఎన్నికల్లో నిలిచారని, ప్రజలు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించాలని పరకాల ఎమ్మెల్యే రవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని పలు గ్రామాల్లో MLA బుధవారం ఉదయం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలిపారు.