MNCL: జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్ తలనొప్పిగా మారుతున్నాయి. కాంగ్రెస్కు నాయకులు ఖరారు చేసిన అభ్యర్థులతో పాటు రెబెల్స్ అభ్యర్థులు సర్పంచ్ స్థానాలకు పోటీలో ఉండటం ప్రధాన కారణం. దీంతో ఓట్లు చీలి, ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా మారతాయేమోనని శ్రేణులు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో ప్రధాన పార్టీలు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.