MHBD: గంగారం మండలం మడగూడ గ్రామ సర్పంచ్‌గా ఈసం సురేష్‌ను స్థానికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన గ్రామపంచాయతీ ప్రజలకు మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, సర్పంచ్ సురేష్ బుధవారం ధన్యవాదాలు తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు.