KDP: ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్లు అక్కడి పోలీస్ ఔట్ పోస్ట్ ఇంఛార్జ్ షబ్బీర్ తెలిపారు. ఈనెల 4న అనారోగ్యంతో చికిత్స కోసం చేరి.. ఆస్పత్రిలో మృతి చెందినట్లు డాక్టర్లు తెలియజేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీలో ఉంచినట్లు పేర్కొన్నారు. బంధువులు, తెలిసిన వారు మృతదేహాన్ని తీసుకెళ్లాలని షబ్బీర్ కోరారు.