BDK: యువతిని ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేసిన గుండాల గ్రామానికి చెందిన జవ్వాజి జోషికిరణ్కు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం పదేళ్ల జైలు శిక్ష విధించారు. అదే గ్రామానికి చెందిన యువతిని మాయమాటలతో లొంగదీసుకుని గర్భవతిని చేసిన నిందితుడు, పెళ్లి చేసుకోవాలని కోరినప్పుడు నిరాకరించాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ శిక్షను ఖరారు చేశారు.