కృష్ణా: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం 15వ డివిజన్‌కు సంబంధించిన సంతకాల సేకరణను విజయవంతంగా పూర్తి చేశారు. సేకరించిన సంతకాల పుస్తకాలను 15వ డివిజన్ కార్పొరేటర్ రఫీ, వైసీపీ కార్యకర్తలతో కలిసి మచిలీపట్నం వైసీపీ ఇంచార్జ్ పేర్ని కృష్ణమూర్తికి నిన్న అందజేశారు.