NRML: జిల్లాలో ఆరు మండలాల్లో 120 గ్రామ పంచాయతీ స్థానాలకు జరగనున్న తొలి విడత ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం తెలిపారు. పరిశీలకులు, పీఓలు, ఓపీఓలు సహా సిబ్బందిని నియమించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. పోలింగ్ సామాగ్రి సమృద్ధిగా ఉందని, పంపిణీ కోసం పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.