JN: జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, పోలింగ్ జరిగే ఆయా మండలాల్లో స్థానిక సెలవు ఇవ్వనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రకటించారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నందున, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల్లో ఈ స్థానిక సెలవులను ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.