KDP: ఖాజీపేట (M) వెంకట రామాపురం గ్రామంలో తాగునీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ దెబ్బతింది. దీంతో నీరంతా వృథాగా బయటకు వస్తూ పరిసరాలు మురుగుమయంగా మారుతున్నాయి. ట్యాంకు దెబ్బతిన్న కారణంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్థులు అంటున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కొత్త ట్యాంకు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.