MNCL: జిల్లాలో రేపు జరగబోయే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాలోని హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి, జన్నారం మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 90 పంచాయతీలకు గాను ఆరు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మూడు పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 81 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు.