W.G: సంక్రాంతి సమీపిస్తున్న వేళ గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల చోరీలు కలకలం రేపుతున్నాయి. కొనుగోలు దారుల రూపంలో వచ్చి పుంజుల రంగు, జాతిని పరిశీలించి, అదను చూసి రాత్రి వేళల్లో వాటిని మాయం చేస్తున్నారు. తాజాగా తాడేపల్లిగూడెంలో భారీగా కోళ్లు చోరీకి గురయ్యాయి. రూ.వేల విలువైన కోళ్లకు కాపలా కాసేందుకు యజమానులకి కునుకు లేకుండా పోతోంది.