ప్రకాశం: రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు బుధవారం దోర్నాల మండలంలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ పరిశీలన రద్దు అయినట్లు మంత్రి కార్యాలయ ప్రతినిధులు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వలన వెలుగొండ ప్రాజెక్టు మంత్రి రావట్లేదని, త్వరలోనే తదుపరి తేదీని వెల్లడిస్తామని చెప్పారు.