సత్యసాయి: రామగిరి ఎంపీపీ ఎన్నికను వైసీపీ బాయ్ కాట్ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రకటించారు. తమకు సంఖ్యాబలం ఎక్కువ ఉన్నా ఎంపీపీ స్థానం కోసం ఎమ్మెల్యే పరిటాల సునీత కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రామగిరిలోని మండల పరిషత్ కార్యాలయంలో రేపు ఎన్నికలు జరగనుండగా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.