MBNR: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలుగా జరుగనున్నాయి. రేపు జరగనున్న తొలి విడత పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రాజాపూర్, నవాబుపేట, మహమ్మదాబాద్, గండీడ్ మండలాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 వరకు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది.