గుంటూరు: మంగళగిరి పార్కుల్లో అధికారుల పర్యవేక్షణ లోపంతో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మండల పరిషత్ పార్కులో చిన్నారుల ఆట వస్తువులు పాడైపోగా, బ్యాంక్ కాలనీ పార్కు పచ్చదనం లేక అపరిశుభ్రంగా ఉంది. దీంతో అక్కడకు వచ్చే పిల్లలు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని వెంటనే సరిచేయాలని ప్రజలు కోరుతున్నారు.