AP: రాజధాని ప్రాంతంలో పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం భూసమీకరణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వడ్డమానులో రైల్వే ట్రాక్, రైల్వే స్టేషన్, ఇన్నర్ రింగ్ రోడ్ తదితరాల కోసం 1768 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేయనుంది. దీంతో స్థానిక రైతులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. ఆయనతో పాటు తుళ్లూరు MLA శ్రావణ్, CRDA అదనపు కమిషనర్ భార్గవతేజ ఉన్నారు.