కాకినాడ జిల్లా ఉపాధి కార్యాలయం డిసెంబర్ 12న ఉదయం 10.30 గంటలకు ఉద్యోగ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జి. శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేళాలో జూనియర్ సూపర్వైజర్స్, ఇంజినీర్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టులకు డిప్లొమా మెకానికల్, ఇంటర్మీడియట్, ఆపైన అర్హతలు గల అభ్యర్థులు పాల్గొనవచ్చు. ఎంపికైన వారికి జిల్లాలోనే ఉద్యోగాలు వస్తాయన్నారు.