BHPL: భూపాలపల్లి RTC డిపో నుంచి హన్మకొండ పట్టణానికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు అంబేద్కర్ చౌక్ వద్ద ఆగిన సమయంలో ప్రయాణికుడు ఉర్సు నరేశ్ డ్యూటీలో ఉన్న కండక్టర్ పై దాడి చేశాడు. “ఎంతసేపు ఆపుతారు” అంటూ బూతులు తిడుతూ దాడి చేయడంతో కండక్టర్‌కు రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.