NLR: కావలి ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం వింజమూరు తహసీల్దారు కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ డే నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో ప్రజలు తమ వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించవచ్చని తహసీల్దార్ హమీద్ పేర్కొన్నారు. ఈ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు.