GDWL: గట్టు మండలం చాగదోణ సర్పంచ్ అభ్యర్థి వీర శేఖర్ గౌడ్ ఏకంగా 22 హామీలతో ప్రచారం చేశారు. మంగళవారం ప్రచారంలో నాయకులు ఈ వివరాలు వెల్లడించారు. లైబ్రరీ ఏర్పాటు, నీటి కష్టాల నివారణ, ఉచిత గ్యాస్ కనెక్షన్, ఇంకుడు గుంతలు, గర్భిణులకు పోషక ఆహారం వంటి హామీలు అందులో ఉన్నాయి. ఒకే అభ్యర్థి ఇన్ని హామీలు ఇవ్వడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.