కృష్ణా: కంకిపాడు మండలం మద్దూరులో దనేకుల టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాల NSS యూనిట్ నిర్వహించిన శిబిరాన్ని సర్పంచ్ చిప్పల రాందాస్ ర్యాలీతో బుధవారం ప్రారంభించారు. ఇషా ఫౌండేషన్ సమన్వయకర్త పూజిత కాలుష్య నియంత్రణపై అవగాహన కల్పించారు. అనంతరం గ్రామంలో పలుచోట్ల చెట్లు నాటారు. క్యాంప్ ప్రోగ్రామ్ ఆఫీసర్ టి. వెంకటేశ్వరరావు, కో ఆర్డినేటర్లు కృష్ణస్వాయి పాల్గొన్నారు.