MNCL: జైపూర్ అటవీ ప్రాంతంలో రెండు పులుల సంచారం కలకలం రేపుతోంది. హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఒక మామిడితోటతో పాటు వేలాల ఇసుక క్వారీ వద్ద పెద్దపులుల పాదముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో అటవీ పరిసర ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. రైతులు పత్తి చేన్లకు, పశువుల కాపర్లు ఒంటరిగా అటవీ ప్రాంతం వైపు వెళ్లవద్దని కోరారు.