SDPT: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న అక్కన్నపేట మండల కేంద్రంలోని కస్తూర్భాగాంధీ పాఠశాల, కళాశాలను తహశీల్దార్ మధుసూదన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలవ్యాప్తంగా సర్పంచ్, వార్డు సభ్యుల పార్టీ అభ్యర్థుల గుర్తుల కేటాయింపు విషయంపై ఆయన చర్చించారు. ఈ తనిఖీలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ యాదగిరి, జీపీఓ గంగరాజు పాల్గొన్నారు.