ADB: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి గొడవలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని బుధవారం నార్నూర్ ఎస్సై అఖిల్ అన్నారు. మండలంలోని పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి ఉంటుందన్నారు. రేపు తొలి విడత ఎన్నికల్లో భాగంగా జరిగే పోలింగ్‌కు అధికారులను సహకరించాలని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.