AP: మాజీ మంత్రి YS వివేకా హత్య కేసులో సమగ్ర దర్యాప్తు జరపాలని ఆయన కూతురు సునీత వేసిన పిటిషన్పై HYD నాంపల్లి CBI కోర్టు ఇవాళ తీర్పు వెల్లడించనుంది. ఈ నెల 3న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. ఉ.11:30 గంటలకు తీర్పు ఇవ్వనుండగా.. కేసు రీ ఇన్వెస్టిగేషన్కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.