NGKL: చారకొండ మండలం సేరి అప్పారెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ పదవి ఏకగ్రీవమైంది. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో, ప్రత్యర్థి తన నామినేషన్ను వెనక్కి తీసుకోవడంతో కొర్ర సురేష్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఆయన కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచినట్లు స్థానికులు తెలిపారు.