కృష్ణా: ఉయ్యూరులోని ఏ.జీ. & ఎస్.జీ. సిద్ధార్థ కాలేజీలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్నారు. ఆయన విద్యార్థులతో కలిసి కబడ్డీ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొని, ప్రతిభకనబర్చిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు చదువులో ముందుకు సాగి, ఉన్నత శిఖరాలను చేరాలని పేర్కొన్నారు.