తిరుపతి జిల్లాకు చెందిన అంధ స్కేటర్ మురారి హర్షవర్ధన్ నాన్‌స్టాప్‌గా 200 KM బ్లైండ్ స్కేటింగ్ మారథాన్ చేశాడు. ఆర్టిస్టిక్, మల్టీటాస్క్ విభాగాల్లో ప్రపంచ రికార్డులు సాధించాడు. సంబంధిత సర్టిఫికెట్లను తిరుపతిలో మంగళవారం సాయంత్రం బాలుడికి అందజేశారు. వండర్ బుక్, జీనియస్ బుక్, వజ్ర రికార్డ్స్ ప్రతినిధులు పురస్కారాలు ఇచ్చారు.