ADB: ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం చేసిన పట్టణానికి చెందిన తన్నీరు హేమావతి అనే మహిళను అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్ మంగళవారం తెలియజేశారు. వికాస్ యోజన కార్యాలయం పేరుతో అమెజాన్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ రూ. 2.25 లక్షలు వసూలు చేసినట్లు వెల్లడించారు. బాధితులు ఎవరైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించవచ్చునని సూచించారు.