TG: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ ఎన్నికల ప్రచారం సమయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ, రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందాడు. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.