NGKL: గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసినందున, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ హెచ్చరించారు. ఆరు మండలాల పరిధిలో నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఈనెల 11న ఉదయం 7 నుంచి ఒంటి గంట వరకు పోలింగ్, 2 గంటలకు ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు.