KKD: సామర్లకోటలో నూతన ఎస్ఐగా ఎం. రాజా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన జిల్లా ఎస్పీ బిందు మాధవను మర్యాదపూర్వకంగా కలిసి, బాధ్యతలు చేపట్టిన విషయాన్ని వివరించారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బంది సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్ఐ రాజా తెలిపారు. ఈ సందర్భంగా పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజు, సామర్లకోట సీఐ కృష్ణ భగవానులను ఆయన కలిశారు.