బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. తన పుట్టినరోజులు కూడా మిస్ అయినట్లు తెలిపింది. ‘నా తండ్రి ఆసుపత్రిలో ఉంటే ఆయన చివరి రోజులలో కూడా నేను చూసుకోలేకపోయాను. నా కుటుంబంతో గడిపిన సందర్భాలూ చాలా తక్కువ. 20 ఏళ్లు త్యాగం చేసి ఈరోజు ఇలా ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది.