KRNL: మంత్రాలయం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వార్షిక తనిఖీ చేశారు. కేసుల పరిశీలనతో పాటు పెండింగ్ దర్యాప్తుల పురోగతి గురించి తెలుసుకున్నారు. డ్రంకెన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రాపర్టీ కేసులను వేగంగా చేధించాలని ఆదేశించారు. రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.