NZB: పంచాయతీ ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. నిన్నటితో తొలి విడత ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. నిజామాబాద్ జిల్లాలో తొలి విడతలో 29 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా 155 స్థానాలకు 466 మంది పోటీలో నిలిచారు. రెండో దశ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మూడో విడతలో పోటీలో ఉన్న అభ్యర్థుల లెక్క తేలింది. 19 గ్రామాలు ఏకగ్రీవం కాగా 146 స్థానాలకు 548 మంది బరిలో ఉన్నారు.