ప్రకాశం: మార్కాపురం మండలంలోని బొందలపాడు గ్రామంలో మార్కాపురం వైసీపీ ఇంఛార్జ్ అన్నా రాంబాబు ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రాత్రి నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోలకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.